అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం..ఎమ్మెల్యే

అనంతపురం, రాప్తాడు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. రామగిరి మండలం వెంకటాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఆమె ఆదివారం సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై చర్చించారు. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో సుమారు 11వేల మంది లబ్ధిదారులను ప్రాథమికంగా అర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్