ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు జూలై 10, 11 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలోని టీకేఆర్ కల్యాణ మండపంలో జరగనున్నాయి. ఈ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ, రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పీడీ ఎస్ యూ కరపత్రాలను విడుదల చేసింది. అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ, ఈ రెండు రోజుల శిక్షణా తరగతుల్లో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, విద్యా రంగంలో మార్పులు, విద్యార్థి ఉద్యమాల భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.