రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీ వద్ద ఎలుగుబంటి సంచారంలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం సాయంత్రం కురాకుల గుట్ట వద్ద ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు కేకలు వేయడంతో కొండగుట్టలోకి వెళ్లిపోయింది. రాత్రి సమయాల్లో ఎలుగుబంటి ఇళ్ల వద్దకు వస్తుందని దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి ఇళ్ల వద్దకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.