రాయదుర్గం: టిప్పర్ కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామంలో టిప్పర్ కిందపడ్డ మహేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం గ్రామ సమీపంలో కలుగోడు రోడ్డుకు టిప్పర్ మట్టి తోలుతుండగా ద్విచక్ర వాహనంపై వెళ్లిన మహేశ్వరరెడ్డి అదుపుతప్పి టిప్పర్ కింద పడడంతో గాయపడ్డాడు. అతన్ని కుటుంబసభ్యులు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుమ్మఘట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్