రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ సమీపంలో కూలీలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపుతప్పి శనివారం బోల్తాపడిందన స్థానికులు వివరించారు. కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, దర్గావన్నూరు వైపు నుంచి సుమారు 20మంది కూలీలు పాల్తూరు వైపు టాటా ఏసీ వాహనంలో వెళ్తున్నారని, రోడ్డుపై ఉన్న మొక్కజొన్న సొప్పపై వెళ్లడంతో అదుపతప్పి ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్