రాయదుర్గం: ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

రాయదుర్గం పట్టణంలో బుధవారం రాజీవ్ గాంధీ కాలనీలో దుగ్గిలమ్మ గుడి తోటలోని నీటి బావిలో స్నేహితులతో ఈత కొట్టడానికి వెళ్లి రాజశేఖర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో పాటు ఈదుతూ మునిగిపోయాడని స్నేహితులు తెలపడంతో తల్లిదండ్రులు, బంధువులు వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఫైర్ ఆఫీస్ సిబ్బందికి సమాచారం అందించి మునిగిపోయిన యువకుడి కోసం ముమ్ముర ప్రయత్నాలు చేసిన ఆచూకీ లభించలేదు.

సంబంధిత పోస్ట్