డి. హిరేహాల్ మండలం పులకుర్తిలో శ్మశాన వాటికలో నీటి సౌకర్యం కల్పించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ దొణప్ప ఈ సమస్యను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి బోరు బావిని ఏర్పాటు చేయించారు. దీంతో పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చి, మోటారు బిగించి నీటి ఇబ్బందులు లేకుండా చేశారని తెలిపారు.