గార్లదిన్నె మండలం కల్లూరులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాత కల్లూరుకు చెందిన పుల్లయ్య(49) వెంకటేశ్వర రైస్ మిల్లు సమీపంలో పాత కల్లూరు నుంచి అగ్రహారం వైపు వెళ్లే రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. స్థానికులు గమనించి అతడిని పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.