పుట్లూరు మండలం బాలాపురం గ్రామానికి చెందిన రేణుక (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. తలారి పెద్దయ్య కుమార్తె రేణుక కుటుంబ కలహాలతో గత నాలుగేళ్లుగా భర్తకు దూరమై తండ్రి వద్దనే జీవిస్తోంది. మూడు రోజుల కిందట కొలిమిగుండ్ల వద్ద ఉన్న తుమ్మలపెంట అవ్వ వద్దకు వెళ్లిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఎస్ఐ హేమాద్రి కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేపట్టారు.