జగనన్న కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని వినతి

నార్పల మండలం గూగూడు గ్రామంలోని జగనన్న కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ ఎంపీడీఓ దివాకర్ ను కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో నీటి సౌకర్యం లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్