హైవేపై ప్రమాదం.. 10 మంది కూలీలకు గాయాలు

గార్లదిన్నె మండలం కలగాసపల్లి క్రాస్ వద్ద హైవే పై ఆదివారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొంది. ప్రమాదంలో 10మంది కూలీలు, బస్సు కండక్టర్ గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కూలీలంతా మహబూబ్ నగర్ వాసులుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్