గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన శ్రీనివాసులు(34) అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఇంటిలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మృతుడు తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.