రైలు ఢీకొని వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు వైఎస్సార్ జిల్లా దత్తాపురానికి చెందిన రంగారెడ్డి (46) గురువారం ఉదయం అదే గ్రామ శివారులోని రైలు పట్టాల వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్