స్టంట్ వీరులు లక్కీవిక్కీలను అభినందించిన సినీనటుడు భానుచందర్

అనంతపురం జిల్లాకు చెందిన యువ సాహసవీరులు లక్కీ సాయి నరసింహ రెడ్డి, విక్కీ గౌతమ్ కుమార్ రెడ్డి 100 కార్లు, 100 బైక్‌లపై సాహస విన్యాసాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో, వారు ప్రముఖ సినీ నటుడు భానుచందర్ ని కలవగా అభినందించారు. చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిన వారి ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, క్రమశిక్షణ, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వారి తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని, కోచ్ ఎం. సాయిబాబా శిక్షణను కూడా కొనియాడారు. లక్కీ, విక్కీలు తమ ప్రపంచ రికార్డు సర్టిఫికెట్లను భానుచందర్‌కు చూపించగా, వారిని ఆశీర్వదించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్