తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుక కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున చేరుకుని సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా సంగీతంలో మునిగిపోయి సంతోషంగా గడుపుతున్నారు.