తాడిపత్రి మండలంలో గన్నెవారిపల్లి కాలనీకి చెందిన రేణుక అనే మహిళ ఆటోలో ఇగుడూరుకు వెళ్తుండగా చుక్కలూరు వద్ద ముగ్గురు స్కార్పియో వాహనంలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిన విషయంపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని వదిలివేశారన్నారు. వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు, మనస్పర్ధలే దీనికి కారణమని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.