తాడిపత్రిలో మరోమారు చైన్ స్నాచింగ్

తాడిపత్రిలో మంగళవారం రాత్రి మరోమారు చైన్ స్నాచింగ్ జరిగింది. గాజుల కృష్ణప్ప వీధిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంటి ముందర కల్లాపి చల్లి ముగ్గులు వేసుకోవాలని ఓ మహిళ కల్లాపి నీళ్లు చల్లుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వచ్చి మహిళ మెడలో నుంచి సుమారు 40 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్ళారు. రాజేశ్వరి కేకలు వేసే సరికే దుండగుడు పరారయ్యాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్