అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బండా మసీదు ప్రాంతంలో సయ్యద్ వలి, నౌషాద్ కుటుంబాల మధ్య రూ.1,000 బాకీ విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కొడవళ్లు, మటన్ కొట్టే కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో నౌషాద్, సయ్యద్ వలి కూడా ఉన్నారు.