యాడికిలో వడదెబ్బతో కూలి మృతి

వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి చెందిన ఘటన యాడికిలో బుధవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని కమ్మ వీధికి చెందిన కంబగిరి రాముడు మంగళవారం ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థకు గురయ్యాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్