ఇద్దరు కుమార్తెల సహా రైలు కిందపడి తల్లి ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. యాడికి మండలం రాయలచెరువు - వేములపాడు రైల్వే స్టేషన్ల మధ్య తల్లీకుమార్తె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి, ఒక కుమార్తె సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా ఆ చిన్నారి కూడా మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕