పెద్దపప్పూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం కారు ఢీకొని చిన్నజలాలపురం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి (63) అనే వృద్ధుడు మృతి చెందాడు. తన స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో తాడిపత్రికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఎర్రిస్వామికి బలమైన గాయాలయ్యాయి. వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. పెద్దపప్పూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్