తాడిపత్రి ఖ్యాతిని పెంచిన తైక్వాండో కోచ్‌కు ఘన సత్కారం

తాడిపత్రిలో నూర్ భాషా దూదేకుల సేవా సంఘం ఆధ్వర్యంలో  సాయిబాబా ని ఆదివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. తైక్వాండో విద్యలో ప్రావీణ్యం సంపాదించి, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న సాయిబాబా విద్యార్థులు 100 కార్లు, 100 మోటార్ సైకిళ్లపై సాహస విన్యాసాలు చేసి ఆంధ్ర తెలుగు బుక్ లో స్థానం సంపాదించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ కూడా వీరిని ప్రశంసించారు. సాయిబాబా పేరు, విద్యార్థుల ప్రతిభ వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించాలని సంఘం కోరుకుంది. ఈ సందర్భంగా సాయిబాబా కి సంఘం కార్యాలయంలో పూలమాలలు, శాలువాలతో సన్మానం చేశారు. ఆర్య వైశ్య సంఘం కూడా ఆయన సేవలను గుర్తించి సన్మానించింది.

సంబంధిత పోస్ట్