తాడిపత్రి: పేకాటరాయుళ్ల అరెస్టు

తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ పొలాల్లో గురువారం పేకాట ఆడుతున్న 10మందిని అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ. 29 వేల నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాటస్థావరంపై దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 10 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్