తాడిపత్రి మండలం యుగుడూరు, బందార్లపల్లె గ్రామాల మధ్య శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి ప్రొద్దుటూరుకు పొట్టేల్లతో వెళుతున్న వ్యాన్ టైర్ పగిలి అదుపు తప్పి బోల్తా పడటంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వ్యాన్ లోని పొట్టేళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.