తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం కార్యకర్తలతో కలిసి తిమ్మంపల్లి నుండి బయలుదేరిన పెద్దారెడ్డి కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యాడు.