తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఆలూరు కోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. రాతిదూలం లాగుడు పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.