యాడికి: అన్నదమ్ములపై కట్టెలతో దాడి

యాడికి మండలం వేములపాడులో అరుగు విషయంలో సోమవారం అన్నదమ్ములు పెద్ద పుల్లారెడ్డి, చిన్న పుల్లారెడ్డిలపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇంటిముందు ఉన్న అరుగును అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, నారాయణ, షరీఫ్, అఖిల్, మస్తాన్ తొలగిస్తుండగా అన్నదమ్ములు అడ్డుపడ్డారు. దీంతో పైపులు, కట్టెలతో చిన్న పుల్లారెడ్డి, పెద్ద పుల్లారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

సంబంధిత పోస్ట్