యాడికి మండలం రాయలచెరువు-వేములపాడు గ్రామాల మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రికి చెందిన నలుగురు కారులో గుత్తికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని తాడిపత్రికి తరలించారు. అందులో ఒకరిని కర్నూల్ రెఫర్ చేశారు. పోలీసు దర్యాప్తు చేపట్టారు.