యాడికి: ఒకరికి తీవ్ర గాయాలు

యాడికి పట్టణం కమలపాడు రోడ్డులోని వెంగమనాయుడు కాలనీ వద్ద గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రి కాలనీకి చెందిన నరసింహ స్నేహితుడి పొలం వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కన ఉన్న రాళ్లపై పడ్డాడు. తలకు తీవ్ర మైన గాయం కావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తాడిపత్రికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్