అనంతపురం: విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

యాడికి మండలం నిట్టూరు గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వెంకటరాముడు (48) అనే వ్యక్తి పురుగు మందు తాగాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్