గురుకులం విద్యార్థినులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవాలని వైద్యాధికారి డాక్టర్ వినీత, ఎంపీడీవో సుబ్బరాజు తెలిపారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో స్టాప్ డయేరియా కంట్రోల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వినీత, ఎంపీడీవో సుబ్బరాజు మాట్లాడుతూ విద్యార్థినిలు సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.