కూడేరు మండలంలో గురువారం ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొననున్నారు.