కూడేరు మండలం జల్లిపల్లి టోల్ గేట్ దగ్గర మంగళవారం గుర్తు తెలియని కారు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది. సమాచారం అందుకున్న ఉరవకొండ అగ్నిమాపకశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కారు ఎవరిది, ఎక్కడికి వెళుతోంది, అగ్ని ప్రమాదానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.