ఉరవకొండ: సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్

ఛాయాపురంలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామం నుంచి బయలుదేరి 10:35కి విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 10:40 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ లో బయలుదేరి 11:20 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 11:30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్ లో బయలుదేరి 12 గంటలకు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 12 నుంచి 12: 10 వరకు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరులు స్వాగతం పలుకుతారు.

సంబంధిత పోస్ట్