ఉరవకొండ: హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే

హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఉరవకొండ నియోజకవర్గంలోని వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. అధికార పార్టీ నేతలు స్థానిక ప్రజా ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, వెన్నపూస రవీంద్ర రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్