ఉరవకొండ: ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం

విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో బుధవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. మరోపక్క ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్