ఉరవకొండ: ఉన్నట్టుండి కుప్పకూలి కిందకు పడి వ్యక్తి మృతి

ఉరవకొండ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక వేళ విషాద ఘటన జరిగింది. సోమవారం పెద్ద ముష్షూరు గ్రామానికి చెందిన నాగరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భోజనం చేసే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఉరవకొండ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానిక బైపాస్ నుంచి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చిన అనంతరం ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్