బెళుగుప్ప మండలం కాలువపల్లి వద్ద అనంతపురం-కళ్యాణదుర్గం బైపాస్ లో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు లారీలు అతివేగంగా వచ్చి పరస్పరం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులనుగాయపడ్డవారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.