ఉరవకొండ: ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికను వేధింపులకు గురిచేస్తున్న యువకులపై పోక్సో కేసు నమోదు చేశామని బెళుగుప్ప ఎస్ఐ శివ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్