ఉరవకొండ హమాలి కాలనీలో నివసించే హజరతయ్య (53) తన ఇంట్లో శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారులు జీవితంలో స్థిరపడలేదన్న మనస్తాపంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు.