కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో శివవేణి అనే మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి పెన్నహోబిలం దర్శనం, పీఏబీఆర్ డ్యాం విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.