ఉరవకొండ: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

ఉరవకొండ పట్టణంలోని చంగల వీధిలో కిషోర్ కుమార్ అనే యువకుడు శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్