ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోరుతూ గత మూడు దశాబ్దాల కాలంగా ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేశామని, నేడు ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు వెల్లడించడం స్వాగతనీయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల రవి తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ గురువారం పట్టణంలో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు.