సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు 50 శాతం సబ్సిడీపై సమీకృత పశువుల దాణా ను పంపిణీ చేస్తోందని అన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.