పట్టణాల్లో పారిశుధ్యం కాలువల నిర్మాణాలతోనే సాధ్యపడుతుందని ఆముదాలవలస మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ అన్నారు. శనివారం ఆముదాలవలస మున్సిపాలిటీలో పరిధిలోని 17వ వార్డు పూజారిపేటలో 15 ఆర్థిక సంఘం నిధులతో కాలువ పనులు ప్రారంభించారు. కాలువల నిర్మాణాలతోనే పారిశుధ్య మెరుగుపడుతుందని ఆయన అన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మురళి, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.