అర్హులైన వారికి సామాజిక పెన్షన్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆముదాలవలస మండలం పరిధిలో పలు గ్రామాలలో వికలాంగులు, బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్ అనుసంధానం కాని వారికి శనివారం సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. డి ఆర్ డి ఏ తరపున ఏపీఎం కూర్మారావు క్షేత్రస్థాయిలో సామాజిక పెన్షన్లు పంపిణీ పరిశీలించారు. అన్ని గ్రామాల్లో 90% పైగా పంపిణీ జరిగిందన్నారు.