, ఆముదాలవలస మండలం, బురిడికంచరాం గ్రామంలో సత్యం యువసేన, రాగోలు జేమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించాయి. ఈ శిబిరంలో ఎండి, ఆర్థో, కంటి వైద్య నిపుణులు పాల్గొన్నారు. అవసరమైన వారికి ఈసీజీ, టుడి, ఎకో పరీక్షలు నిర్వహించి, ఆర్థో సమస్యలకు సర్జరీ కూడా చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల PACS చైర్మన్ వండాన మురళి, సత్యం యువసేన సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.