ఆయుష్మాన్ భారత్ లో భాగంగా విద్యార్థుల రూపొందించిన భారతదేశ చిత్రపటం ఆకట్టుకుంటుంది. ఆముదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు వినూత్న రీతిలో చేట్లు ఆకులతో చిత్రపటం వేశారు. తులసి, మునగ, వేప, మర్రి, గన్నేరు, బొప్పాయి, రావి ఆకులతో రూపొందించారు. ఈ చిత్రపటం హెచ్ఎం దాసరి నారాయణరావు(బుజ్జి )ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించారు.