సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌లో ఆదివారం ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఈతకు వెళ్లగా, కెరటాల ఉద్ధృతికి నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, ఒకరిని మెరైన్ పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. టెక్కలిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న జార్జాన అభిలాష్‌ను పోలీసులు కాపాడారు. మిగిలిన ముగ్గురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.