అమరావతి రాజధానిపై మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన తీరుపై నిరసన

ఆముదాలవలస పట్టణంలో పలువురు తెలుగు మహిళా సంఘం సభ్యులు మంగళవారం సాయంత్రం నిరసన ర్యాలీ చేపట్టారు. సాక్షి దినపత్రిక ఛానల్లో అమరావతి రాజధానిపై, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన జర్నలిస్టులపై తగు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎస్సై బాలరాజుకు, అలాగే స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు. తమ్మినేని సుజాత, గీతా విద్యాసాగర్, కే విజయలక్ష్మి, కూటమి నాయకులు రామ్మోహన్రావు, ఆనెపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్